Sunday, April 6, 2008

మాగాయ పచ్చడి

కావలసిన పదార్దాలు:

  • పచ్చి మామిడి కాయలు - 10
  • కారం పొడి - 250 గ్రా .
  • ఆవాలు - 100 గ్రా
  • మెంతులు - 100 గ్రా
  • నూనె - 200 గ్రా
  • ఉప్పు - 250గ్రా
  • ఇంగువ - 1/4 tea spoon

తయారు చేయు విధానం :

  • మామిడి కాయల తొక్కలు తీసి నిలువుగా సన్నని ముక్కలను టెంక మీదగా కోయాలి.
  • వాటికి ఉప్పు కలిపి, నాలుగు రోజులు పాటు ఎండ లో బాగా ఎండనివ్వండి
  • ఎండిన మామిడి కాయ ముక్కలకు కారం పొడి, ఆవాలు, మెంతులు వేయించి పొడిగా దంచి కలపండి.
  • తర్వాత ఒక బాణలి లో నూనె వేడి చేసి దానికి ఇంగువ పొడి ని చేర్చండి
  • నూనె బాగా చల్లారినాక మామిడి కాయ ముక్కలకు కలిపి నిలువ చేయండి
  • ఒక వారం రోజుల తర్వాత మాగాయ పచ్చడి తయారు

No comments: