కావలసిన పదార్దాలు:
- పచ్చి మామిడి కాయలు - 10
- కారం పొడి - 250 గ్రా .
- ఆవాలు - 100 గ్రా
- మెంతులు - 100 గ్రా
- నూనె - 200 గ్రా
- ఉప్పు - 250గ్రా
- ఇంగువ - 1/4 tea spoon
తయారు చేయు విధానం :
- మామిడి కాయల తొక్కలు తీసి నిలువుగా సన్నని ముక్కలను టెంక మీదగా కోయాలి.
- వాటికి ఉప్పు కలిపి, నాలుగు రోజులు పాటు ఎండ లో బాగా ఎండనివ్వండి
- ఎండిన మామిడి కాయ ముక్కలకు కారం పొడి, ఆవాలు, మెంతులు వేయించి పొడిగా దంచి కలపండి.
- తర్వాత ఒక బాణలి లో నూనె వేడి చేసి దానికి ఇంగువ పొడి ని చేర్చండి
- నూనె బాగా చల్లారినాక మామిడి కాయ ముక్కలకు కలిపి నిలువ చేయండి
- ఒక వారం రోజుల తర్వాత మాగాయ పచ్చడి తయారు